కవిని నేనైతేకవితలు నేను రాసేస్తా
రైతును నేనైతే
కరువును నేను పోగొడతా
గురువును నేనైతే
గురుతుగ బోధలు చేసేస్తా
జవాను నేనైతే
జాతిని నేను కాపాడుతా
వ్యాపారిని నేనైతే
నీతిగ సరుకులు నేనిస్తా
కార్మికుడిని నేనైతే
అభివృద్ధిని నేను సాధిస్తా
నాయకుడిని నేనైతే
చక్కని నిర్ణయాలు చేసేస్తా !!
నేనైతే: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.