సంపన్నులుండే ప్రాంతంలో ఆధునిక హంగులతో వసతులతోపెద్ద బంగ్లా కట్టించారు.సమాజంలో తనకొక ప్రత్యేక గుర్తింపుఉండాలనుకుంటారు.ఆయన భార్య మాత్రం సమాజసేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాదాసీదా కనబడుతుంది.సుబ్బారావు గారి ఏకైక పుత్ర రత్నం కామేశం కార్పొరేట్స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు.చదువులో చురుకు,తెలివైన వాడు. కాని అల్లరెక్కువ.ఒక శలవు రోజున హాల్లో సోఫాలో తీరికగా కూర్చున్న సుబ్బారావు గారికి ఏమీ తోచక బయట రూబిక్స్ క్యూబ్ ఆడుతున్న కొడుకు కామేశాన్ని లోపలికి పిలిచారు.కామేశం లోపాలికి రాగానే సోఫాలో పక్కన కూర్చో పెట్టుకుని సుబ్బారావు గారు హాల్లో ఉన్న పెద్ద తైలవర్ణ ఫోటోలుఒక్కొక్కటి చూబెడుతు " ఈయన మా తాతయ్య రావుబహదుర్ వెంకట రామయ్య గారు , బ్రిటిష్ వారి హయాంలో గుర్రపు బగ్గీల్లో తిరిగే హోదా ఉన్న సబ్ కలెక్టర్ఉధ్యోగం చేసేవారు.కామేశం చేతిలో క్యూబ్ తిప్పుతు ఆడుతున్నాడు. మధ్యలో ఉ కొడుతున్నాడు.ఇదిగో , ఈ ఫోటో చూడు అంటూ మరో తైలఫోటో చూపెడుతూ , ఈయన మా నాన్న పరంధామయ్య గారు ఆకాలంలో పెద్ద పేరున్న వకీలు. బెంజి కార్లో తిరిగే వారు.లండన్వెళ్లి బారెట్లా చదివారు.కోర్టులో కేసు వాదించారంటే తిరుగుండదు"అంటూ వారి వంశ ఘనతను చాటి చెప్పారు." నువ్వు కూడా బాగా చదివి, మంచి పనులు చేసి నా పేరునిలబెట్టాలి"అన్నారు సుబ్బారావు." అలాగే , నాన్న గారూ!"అన్నాడు క్యూబ్ కలర్స్ మారుస్తు." ఎలా ?" అడిగారు సుబ్బారావు" మన బంగ్లా గేటు పక్కన పెద్ద గోలెంలో పచ్చని మొక్కనునాటి ఒక కర్రకు మీ పేరున్న బోర్డు వేలాడదీస్తాను" అన్నాడుఅమాయకంగా.కొడుకు మాటలు విన్న సుబ్బారావు గారు నిర్ఘాంత పోయారు.* * *
పేరు -- ప్రతిష్ట:--కందర్ప మూర్తి , హైదరాబాద్.