గుర్తుందా ..: : --కె .ఎల్వీ --హన్మకొండ .

 మీకు గుర్తుందా ,
ఈనాటిది కాదు ,
ఏనాటిదో ...
అందరినోళ్ళలో 
నిత్యం నానివున్న 
ఔషదం !
అందమైన డబ్బాలో ,
ఆకర్షణీయమయిన సీసాలో ,
బంగరు రంగు లేపనం,
అదే ...
అమృతం  + అంజనం ,
అమృతాంజనం !!
తలనొప్పి ,
నడుంనొప్పి  ,
కీళ్లనొప్పి _ఒంటినొప్పి 
సమస్థ నొప్పులకు ,
తక్షణ నివారిణి 
అమ్రుతంజనమే !!
భారతి మీకు గుర్తుందా ?
సకల జనులు మెచ్చిన ,
సాహిత్య పత్రిక 
సాంద్రత గల సాహిత్యాన్ని ,
చదివించిన మాసపత్రిక 
శ్రేష్టమైన సాహిత్య పత్రిక !!
ముంబైలో పుట్టి ,
చెన్నైకి వలస వచ్చి ,
బెజవాడలో స్థిరపడి 
ఆపై మూతపడ్డ ,
ఆంద్ర పత్రిక గుర్తుందా ?
దినపత్రికనూ 
వార్తాపత్రికనూ ,
స్త్రీల పత్రిక 'కలువబాల '
పిల్లల పత్రిక 'బాలరంజని '
గుర్తున్నాయా ?
వీటన్నింటినీ
మరచిపోయినా 
వీటి సృష్టికర్తను 
మరువరాదు .
ఆ ..మహామనీషి ,
ఎవరోకాదు ...
స్వాతంత్ర్య సమరయోధుడు,
మనసున్న మనిషి ,
కాశీనాధుని ..
నాగేశ్వర రావు పంతులు ,
ప్రజల మనిషిగా బ్రతికిన 
మహానుభావుడు !!