ఊటుకూరి లక్ష్మికాంతమ్మ.(మనకీర్తిశిఖరాలు).:--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


  వీరు 1917 డిసెంబర్ 21న మదురకవి నాళంకృష్ణారావు సుశీలమ్మ దంపతులకు మాతామహుల ఇంట జన్మించారు.వీరిది సంపన్న కుటుంబం.రాజమండ్రిలో విద్యాభ్యాసం చేసారు.సంస్కృతాంధ్ర కావ్యాలు పఠించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో 'ఉభయ భాషా ప్రవీణ'1935లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.ఈమె ఆధ్యాత్మిక గురువు యల్లాప్రగడ జగన్నాథం పంతులుగారు.1930/మార్చి/24 న హయగ్రీవ గుప్తా గారిని వివాహాం చేసుకుని బాపట్ల మెట్టినింటికి వచ్చాక 'స్త్రీ హితైషిణి మండలలిలో సభ్యురాలిగా చేరి మహిళామండలి భవన నిర్మాణానికి జయపురం మహారాజా లాంటి వారి సహాకారంతో నిర్మాణం పూర్తిచేసారు.త శిక్షణ పొందారు,

1947 లో ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల స్ధాపకురాలు,ప్రధాన అధ్యాపకురాలు,కామాక్షమ్మగారి షష్టిపూర్తి మహాత్సవం జరిపించారు.అనంతరం'ఆంధ్ర కవియిత్రులు'అనేగ్రంధం రచించారు.ఇందులో 264 మంది కవియిత్రుల ప్రస్ధ్తావన ఉంది. బెజవాడ గోపాలరెడ్డిగారు,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమివారి ప్రోత్సాహంతో ఢిల్లి,ముంబై,కలకత్తా వంటి నగరాలలో పర్యటించి తనకు కావలసిన విషయాలు సేకరించుకుని మూడు సంవంత్సరాలుకృషిచేసి 'అఖిల భారత కవియిత్రులు'అనే పుస్తకం వీరు రాయగా 1965 లో వెలువడింది. స్త్రీ వాదంతోకూడిన స్త్రీలే రాసిన కథల తొలి సంకలనం'కథా మందారం'1968 లో సంకలనం చేసారు.వీరి రచనలు గృహలక్ష్మి,భారతి, ప్రభుద్ధాంద్ర, ఆంధ్రమహిళ,కృష్ణాపత్రిక,నవోదయం వంటి పలు పత్రికలలో వెలువరింప బడుతుండేవి.వీరికి గౌరవ డాక్టరేట్ పట్టాతోపాటు,'తెలుగు మొలక' 'విద్వత్కవయిత్రి' 'ఆంధ్రవిధుషీకుమారి,కవియిత్రి తిలక, సాహితీరుద్రమ, కళాప్రపూర్ణ వంటి పన్నెండు బిరుదులు పొందారు. కనకాభిషేకం,గజారోహణం తోపాటుగా ఇరవైకి పైగా ఘన సత్కారాలు పొందారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.రచయిత్రిగా 'దేవస్తవతారావళి'  'మనసాహితి-మధుభారతి (గేయాలు) 'కన్యకమ్మనివాళి' 'మహిళా విక్రమ సూక్తము' 'ఆంధ్రుల కీర్తన వాజ్మయసేవ'వంటి పలురచనలు.

సుహాసిని అనేకుమార్తె,ప్రతాపచంద్రుడు,రాజరాజ నరేంద్రుడు, విజ్ఞానేశ్వరుడు అనే ముగ్గురు కూమారులు.ఆంధ్రసరస్వతి,ఉభయ భాషా ప్రవీణ అయిన వీరు 1/డిసెంబర్/1996న తుదిశ్వాసవిడిచారు.