పిచ్చి మొద్దు: -కీర్తన'సీ'రామ్
 నేనో చచ్చిన పిచ్చ మొద్దుని
ముసలిదాన్ని అయ్యానంటూ
కొట్టి వేయబడ్డ చెట్టులోంచీ
వేరు చేయబడ్డాను
కాసేపన్నా కొన ఊపిరితో
కొట్టుకు చచ్చానో లేదో
బతికుండగా బస్తాలు బస్తాలు
నా ఊపిరి వాళ్ళ ఊపిరి తిత్తుల్లో..
నింపుకున్న వాళ్ళూ
వందలు వేలు కొండొకచో లక్షలు
ఏరీ ఎక్కడా వారూ
పోతున్నారా మొద్దు నిద్దుర.. చెక్క మొద్దులా
ప్రాణం పోసిన తల్లి వయస్సయిపోతే
రాలిపోయే దాకా ఆగరా ఊపిరాపేస్తారా
ఎండిపోయానో పండిపోయానో ఇంకా
ప్రాణం పోస్తూనే ఉన్నానుగా
వయస్సులోదైనా ముసలిదైనా అమ్మ
వాయివు అదేగా
చిగురించననుకున్నారా ఇక
అందుకే చిదిమేశారా
పోన్లే కన్నా ఈ కట్టెనిక ఎక్కువ వేడి చేసి
కాల్చేయమాక, కనీసం నన్నో కుర్చీని చెయ్యి
కాలు మీద కాలేసుకున్న నిన్ను నా ఒడిలో
కూర్చోబెట్టుకుని చాన్నాళ్లయ్యింది..
తిన్నావా అయ్యా.. 'ఛా'.. నీకు పెడదామంటే
ఏ పండూ కాయలేనిక..
పోన్లే నువ్వేగా నా పండు.. భద్రంగా ఉండు
పిల్లా పాపలతో.. జాగ్రత్తరా అయ్యా