త్యాగశీలి యేసు....: -మొహమ్మద్. అఫ్సర వలీషా=ద్వారపూడి (తూ గో జి)

 మానవాళి చేసిన
పాపాలకు
మనఃపూర్వక 
ప్రాణాలర్పించిన
త్యాగశీలి యేసు  ....
మహానుభావుడు  క్రీస్తుల
మనసెరిగిన యేసు 
శిలువ నెక్కిన 
త్యాగమయి యేసు.....
మరణించిన రోజునే
మహాపర్వంగా 
శుభ శుక్ర వారం గా
వెలుగొందిన
అద్భుత యేసు ....
తప్పుల్ని క్షమించాలి 
తన పొరుగు వారిని
ప్రేమించాలి అనే క్షమా 
త్యాగ గుణ యేసు ....
స్థిరమైన సిద్ధాంతాలకు
స్మృతిపధాన్ని
తలుచుకుంటూ...
ఉపవాసం దైవారాధన
ప్రార్థన ప్రాయశ్చిత్తం 
భక్తులకు సమాహారం....
క్రీస్తుల విశ్వాసానికి
కరుణరసం కురిపిస్తూ...
తిరిగి మూడో నాడు
జన్మించిన త్యాగశీలుడు
పవన పావన మూర్తి   యేసు....!!