అక్షర మాల ..: ---డా .కె .ఎల్.వి.ప్రసాద్ హనంకొండ .

 అమ్మా ..అమ్మా ..

తీసుకురావా ,

తెలుఁగు భాష 

నేర్చుకునే ...

అక్షరమాల ...!

అ ..ఆ ..లు 

దిద్దుకుంటా 

అరటి -ఆవు 

నేర్చుకుంటా ..!

ఇ ..ఈ ...లు,

దిద్దుకుంటా ,

ఇటుక -ఈగ ,

నేర్చుకుంటా !


ఉ ..ఊ ..లు 

దిద్దుకుంటా ,

ఉడుత -ఊయల 

నేర్చుకుంటా ..!


ఎ ..ఏ ..లు 

దిద్దుకుంటా,

ఎలుక -ఏనుగు 

నెర్చుకుంటా ..!


తెలుఁగు అక్షరాలు 

తెలుసుకుంటా ...

తెలుఁగు భాష -

నేర్చుకుంటా ...!!

------------------------

  ఫొటో లో--బేబీ ఆన్షి.నల్లి