రామాయణం రాసిన చిన్నారి అద్విక్ : మొలక


 దక్షిణ ఆఫ్రికా లోని జోహెన్నెస్ బర్గ్ లో డ్రీం హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 4 వ గ్రేడ్ చదువుతున్న తొమ్మిదేళ్ల అద్విక్ రాపోలు ఇటీవల రామాయణం రాసాడు. మరి పిల్లల కోసం పిల్లలే రాస్తే బాగుంటుంది కదా. మరి ఇందులో మరో విశేషం ఏమంటే తెలంగాణ లోని మిర్యాల గూడా లో 9వ తరగతి చదువుతున్న హరినందన చిలుకూరి బొమ్మలు వేసింది. ఇద్దరికి అభినందనలు. 
తాను ఈ పుస్తకం ఎలా రాశాడో అద్విక్ మాటల్లో తెలుసుకుందాం. 
'' గత సంవత్సరం మా నాన్న ఒక పుస్తకం రాసారు. అప్పుడు నాకు కూడా ఒక పుస్తకం  రాయాలన్న కోరిక కలిగింది. నాకు రామాయణం చాలా ఇష్టం . కాబట్టి రాద్దాం అనుకున్నాను. వెంటనే రాయడం ప్రారంభించాను. నువ్వు పుస్తకం రాస్తే మేము అచ్చు వేయిస్తాం అని అమ్మ, నాన్న హామీ ఇచ్చారు. కానీ వారు నిజంగా అంటున్నారని అనుకోలేదు. కానీ నేను రాయడం మాత్రం ఆపలేదు 90 శాతం పూర్తి చేసాను. అప్పుడు అమ్మ అడిగింది ఏమైంది పుస్తకం పూర్తి చేశావా అని అడిగింది. అవును రాసాను అని నేను చెప్పాను మా నాన్న వాళ్ళ స్నేహితురాలి కూతురు తో అందంగా బొమ్మలు వేయించారు. బొమ్మలు వేసిన అక్కయ్య పేరు హరినందన చిలుకూరి. నాన్న ఈ పుస్తకం చదివి ఎడిట్ చేసారు. ఇంకేం నా పుస్తకం అచ్చు అయింది. నాకు చాలా ఆనందంగా వుంది. నాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ' 
అని సవినయంగా చెప్పాడు. భవిష్యత్తులో అద్విక్ మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని ఆశీర్వదిద్దాం .