ఐదుతరాలు-బేతాళకథ .డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 పట్టువదలని విక్రమార్కుడు చెట్టు పైనున్న బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
విక్రమార్కుని భుజం పైనున్న శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు"భూపాల నీపట్టుదల మెచ్చదగినదే సకల శేస్త్రాలు అభ్యసించిన నీవు, కణ్వ,కపిల, లోహిత,దేవల, కాత్యాయన,లోకాక్షి,బుధ, శతాతప,అత్రి, ప్రచేత,దక్ష,విష్ణు , వృధ్ధ,థౌమ్య,నారద,పౌలస్య,ఉత్తరాంగీస,విష్ణువృధ్ధ వంటి ఉప స్ముృతులు అధ్యాయనం చేసిన నీకు  పురాణాలపై మంచి అవగాహన ఉన్నవాడివి.నాకు చాలాకాలంగా తెలియని విషయం మహాభారత యుధ్ధంలో ఎన్ని తరాలవారు పాల్గోన్నారు.వివరించు. సమాధానం తెలిసి చెప్పక పోయావో నీ తలపగిలి మరణిస్తావు.
 "బేతాళా మహాభారతంపంచమవేదంగా ప్రాశిస్తిపోందింది.సుమారు 1655 పాత్రలు మనకు కనిపిస్తాయి.సంస్కృతమాలం(వ్యాసవిరిచితం)లో లక్షకు పైగా శ్లోకాలు ఉన్నాయి.కవిత్రయంవారి ఆంధ్ర మహాభారతంలో సుమారు 21,5000 పద్య గద్యలుఉన్నాయి.ఆంధ్రమహాభారతం ప్రకారం శతశృంగపర్వతంనుండి హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజుకు 16,భీమునికి15,  అర్జునునకు 14,కవలలైన భరత-శతృఘ్నలకు-13 సంవత్సరాలనితెలుస్తుంది.భీముడు-ధుర్యోధనుడు ఒకేరోజునజన్మించారుకనుక యిరువురి వయస్సు ఒక్కటే. కృపాచార్యులు అనంతరం ద్రోణాచార్యులవద్ద విలువిద్య అభ్యసించినకాలం 13 సంవత్సరాలట.అంటేవిలువిద్యముగిసేనాటికి ధర్మరాజు వయస్సు29 సంవత్సరాలు.లక్కయింటిలోను,ఏకచక్రపురంలోనుకలిసి  సంవత్సరకాలం ఉన్నారు అనుకుంటే ధర్మరాజువయసు 30. ద్రౌపతినివివాహం చేసుకుని పాండవులు దుృపదునియింట సంవత్సరం ఉన్నారట అంటే ధర్మరాజుకు 31 వయసు.అనంతరం హస్తినకువచ్చి 5 సంవత్సరాలు ఉమ్మడిగాజీవించారట అంటే ధర్మరాజు వయస్సు 36.పిమ్మట రాజ్యంపంచుకుని ఇంద్రప్రస్ధపురం విశ్వకర్మచే నిర్మించుకొని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేసారని సభాపర్వం చెపుతుంది. అంటే36+23=59. పన్నెండేళ్ళు అరణ్యవాసం,సంవత్సరం అజ్ఞాతవాసం 59+13=72 సంవత్సరాలవయసు ధర్మరాజుది.అతనికంటే కర్ణుడు దాదాపు 7లేక8 సంవత్సరాల పెద్దవాడు.మహభారత సంగ్రామంనాటికి ధర్మరాజు వయసు 72 అంటే అతని పితామహుడు అయిన భీష్ముని వయసు ఎంత. దాదాపు 150 నుండి 180 వరకు ఉండాలి .భీష్మునితమ్ముడు బాహ్లీకుడు వయస్సుకూడా దాదాపుగా అంతే ఉంటుంది.కురుక్షేత్రసంగ్రామంలో ధృతరాష్ట్రుని1. పితామహుడు2. పిత , 3.భ్రాతృడు ,4.పుత్రుడు.5. పౌత్రుడు అనే 5 తరాలు అంతరించాయి. 
వంశవృక్షం:చంద్రవంశంలో 39 వ తరం వాడు ప్రతీపుడు యితను శిబి కుమార్తే అయిన సునందను వివాహంచేసుకున్నాడు వారికి  దేవాపి,శంతన,బాహ్లీకుడు. అనేముగ్గురు పుత్రులుజన్మించారు.దేవాపి బాల్యంలోనే తపోధనుడుగా వనవాసంవెళ్ళాడు.శంతనుడు రాజయ్యాడు.అతనికి గంగాదేవికి భీష్ముడు జన్మించాడు.అనంతరంయొజనగంధి అయిన సత్యవతిని వివాంచేసుకోగా,చిత్రాంగద విచిత్రవీర్యులు జన్మించారు.వీరిలోఒకరు గంధర్వరాజు చేతిలో మరణించగా, మరోకరు క్షయవ్యాధికి లోనై మరణించారు.సంతానంకొరకు సత్యవతి తనకోడళ్ళు అయిన అంబిక,అంబాలికలకు దేవర న్యాయంగా కృష్ణ ద్వైపాయని వలన ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు.అంబిక పరిచారికయందు విదురుడుజన్మించాడు. గాంధాకివేదవ్యాసవరప్రసాదంగానూరుగురుసంతతిజన్మించారు. కుంతి మాద్రిలకు పలు దేవతలవరాన పాండవులు జన్మించారు.ద్రౌపతి కిపాండవులకు ప్రతివింధ్యుడు-శ్రుతసోముడు-శ్రుతకీర్తి-శతానీకుడు-శ్రుతసేనుడు అనే పుత్రులు జన్మించారు.అంతేకాకుండా ధర్మరాజు నకు -దేవిక అనేభార్యకు యౌధేయుడు. భీముడు-జలంధరలకు సర్వంగుడు.హిడింభి యందు ఘటోత్కచుడు, అర్జున సుభద్రలకుఅభిమన్యుడు.ఉలూపికిఇరావంతుడు,చిత్రాంగదకు బబ్రువాహనుడు ,నకులుడు-రేణుమతిలకు నిరామిత్రుడు,సహదేవుడు-విజయలకు సుహోత్రుడు,, అభిమన్యు ఉత్తరలకు పరీక్షిత్తుడు,ఇతనికి మద్రావతికి జనమేజయడు జన్మించారు జనమేజయునిభార్య వుపుష్టి.
శంతనుడిసోదరుడు బాహ్లీకుడు అతనికి సోమదత్తుడు,అతనికి భూరిశ్రవుడు ,శల శల్యులనే ముగ్గురు జన్మించారు. మెదటితరంలో భీష్మ,బాహ్లీకులు-రెండోతరంలో సోమదత్తుడు.మూడవతరంలో భూరిశ్రవుడు అతనిసంతతి.నాల్గవతరంలో ధృతరాష్ట్రా-పాండురాజుల సంతతి.ఐదవతరంలో లక్ష్మణకుమారుడు-అభిమన్యుడు-ఉపపాండవులు-ఇరావంతుడు-ఘటోత్కచుడు.పాండు రాజు పౌత్రులలో చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడుతప్ప మిగిలిన12 మంది యుధ్ధంలో మరణించారు." అన్నాడు బేతాళుడు.
విక్రమార్కునికి మౌన భంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికి మారలా వెను తిరిగాడు.