శుభదినం..మొహమ్మద్ అఫ్సర వలీషా-- ద్వారపూడి (తూ గో జి) .-

 శీతా కాలం ధనుర్మాసంలో
చలిని లెక్క చేయక 
భక్తులు వ్రత మాచరించే
 *ఏకాదశి*  
శుభప్రదమైన సుదినం.......
.
 శ్రీ మహావిష్ణువు గరుడ
 వాహనరూఢుడై 
ముక్కోటి దేవతలకు 
ఉత్తర ద్వారాన 
దర్శన భాగ్య మిచ్చిన
 *శుభదినం*........
శ్రీ విష్ణువుద్వారా శక్తి
 ఉద్భవించి 
ముర అనే రాక్షసుని 
సంహరించిన దినం .....
శ్రీ మహాభారత యుద్ధాన
 భగవద్గీతను 
శ్రీకృష్ణుడు అర్జునుడికి
బోధించిన విశ్వాస దినం......
శ్రీ వెంకటేశ్వర నిలయమైన
తిరుమలలో సైతం
వైకుంఠ ఉత్తర ద్వారాన్ని 
తెరిచి భక్తులకు 
దర్శన భాగ్యం కల్గించే
పవిత్ర దినం......
శ్రీ కరమైన ఈరోజున 
భక్తులు భక్తిశ్రద్ధలతో 
ఉపవాస జాగరణ 
జపం ధ్యానం చేసి  
మోక్షాన్ని పొందే 
భక్తి దినం.....