జెన్ : --- యామిజాల
 ఓ లక్ష్యమో
ఓ నియమమో
కాదు.
ఆ మాటకొస్తే
అది ఓ తత్త్వమూ కాదు.
ప్రపంచంలోని సకల తత్త్వ జ్ఞాన సంకెళ్ళనూ తెంచి మనిషికి పరిపూర్ణ విడుదల ఇచ్చేదే జెన్.
సకల మతసార అనుష్టానాలను బద్దలుకొట్టేదే జెన్.
అదొక జీవన పద్ధతా? కాదు.
జెన్ కి చట్టాలూ ప్రణాళికలూ లేవు.
జెన్ పద్ధతిలో జీవిస్తున్నామని కూడా జెన్ జ్ఞానులు చెప్పరు. 
జెన్ గొ ఉండటమే సరైన వివరణ.
జెన్ నమ్మడానికి వీల్లేనంత తేలికైనది. సహజసిద్ధమైంది. ప్రకృతిపరమైంది.
జెన్ ఓ స్వీయదర్శనం.
ఓ శిష్యుడు జెన్ గురించి తెగ మాట్లాడుతుండటం గమనించిన గురువు "నువ్వు చాలా మాట్లాడుతున్నావు. నువ్వు మరీ ఎక్కువైన జెన్ వి"అన్నారు.
"ఎందుకండీ అలా అంటున్నారు? జెన్ గురించి మాట్లాడితే మీకు నచ్చడం లేదు" అడిగాడు శిష్యుడు. 
అప్పుడు గురువు "నాకు వాంతి వొస్తోంది" అన్నారు.
జెన్ గిరిగీసుకుని ఓ చట్రంలో ఇమిడేదీ కాదు.