పేగుబంధం...: -మొహమ్మద్. అఫ్సర వలీషా-- ద్వారపూడి (తూ గో జి )

 ఆత్మీయత నిండిన
ఆ ఐదు వేళ్ళు 
ఆవేదన కన్నీళ్ళు తుడిచి
అరవిరిసిన  ఆత్మ విశ్వాసం
అందిస్తున్నాయి..... 
అనురాగాల ఊయల 
ఆర్తి తో ఊపలేకున్నా
అనుక్షణం తోడూ నీడై
అమ్మలా లాలిస్తున్నాయి....
అంగ వైకల్యం మేనుకు ఉన్నా 
అమ్మ మనసంత స్వఛ్ఛంగా
అమ్మకు అమ్మై తినిపిస్తున్నాయి....
అవని అంతటిది అమ్మ ప్రేమైతే 
అంబరాన్ని తాకేది అమ్మ ప్రేమైతే
ఔరా అనిపించక మానదు
తిరిగి కన్న ప్రేమ పొందుతున్నందుకు....
సృష్టి లో తీయని అమ్మే కాదు 
అమ్మ కన్న ప్రేమ కూడా తీపే
పేగుబంధం  అలాంటిది...!!