కన్నయ్యా...: --మొహమ్మద్ .అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి)

 
నీ నవ్వులు చేసే సందడి
నా మదిలో మరు
మల్లెపువ్వుల్లా 
సందడి చేశాయని చెప్పనా.....
నీ ముద్దు ముద్దు  మాటలు
నా వలపు వాకిట మొగ్గలతో
పూతోటలైనాయని చెప్పనా ....
నీ అడుగుల చిరు చిరు సవ్వడి 
నా మదిలో  చిరు చిరు 
నవ్వుల చిరు సందడి
 చేశాయని చెప్పనా.....
నీ అరవిరిసిన అందాల
 మోము విరిసిన గులాబీనే
 తలదన్నిందని చెప్పనా.....
నీవు నా ప్రక్క నుంటే 
సంతోషం  సరిహద్ద నేలను
 దాటి నింగి అంచులను
 తాకుతాయని చెప్పనా ....
నా అణగారిన ఆశలకు
 నీవే వెలుగైన  దీపమని
 నీ కోసమే నా ఈ  
ప్రాణమని చెప్పనా....!!