ఆదర్శ మూర్తి ...:--------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ .

 క్రీస్తు నేడు పుట్టెను 
హల్లెలూయా ....!
పశువుల పాకలో 
పుట్టెను ఈ పసిబిడ్డ 
హల్లెలూయా ...!
ఆకాశంలో ....
అందాలతార ,
హల్లెలూయా ..!
లోకరక్షకుడు 
జన్మించిన ..
శుభసూచకమూ ..
హల్లెలూయా ..!
త్యాగమయుడు 
యేసయ్యా ....
హల్లెలూయా ...!
కరుణామయుడు 
యేసునాధుడు ..
హల్లెలూయా ...!
నిన్నువలె ..
నీపొరుగువాని 
ప్రేమించుమన్న,
క్రీస్తు యేసుపుట్టుక 
హల్లెలూయా ...!
విశ్వశాంతి కొరకు 
ఆయన చేసిన త్యాగం 
హల్లెలూయా ....!
మరవలేని ..
గొప్ప మహిమ ...
హల్లెలూయా ...!
జనుల చేసి న 
పాపాలకు ...
తనప్రాణం 
త్యాగంచేసిన 
ఏసుక్రీస్తు బోధనలు 
హల్లెలూయా ..!
అందరికి ఆదర్శం 
హల్లెలూయా ...!!
---------------------------
      ఫోటో లో...బేబీ..ఆన్షి.నల్లి.
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.