: అప్పగిస్తున్నా...:--అయిత అనిత

 నా సహనం నీకు ఉపదేశిస్తున్నా..!
వెతల శిశిరంలో శిరసావహిస్తావని!!
నా ధైర్యం నీకు ధారబోస్తున్నా..!
అవసరమైనప్పుడు విధిగా ఉపయోగిస్తావని..!!
నా సంకల్పం నీకు తర్జుమా చేస్తున్నా..! ధిక్కారపుఉరుమై గర్జిస్తావని..!!
నా ఆశ...ఆశయం నీకు సమర్పిస్తున్నా..!
ప్రశాంత నవభారతం నిర్మిస్తావని..!!
నా చేతులసత్తువంతా
నీ లేలేత కరకమలాల్లో కర్తవ్యమై మొలకెత్తాలని...
నా ఊతకర్ర విశ్వాసం
నీ నరనరాల్లో శ్వాసై కొత్తజీవం పోయాలని...
నా ప్రతిఆలోచన నీలో కార్యరూపం దాల్చాలని..
అప్పగిస్తున్నా...!
నా బాధ్యతనంతా నీకే!!
రమరాజ్యం తెస్తావని...రావణలంకను కాల్చేస్తావని
ఉడుకురక్తపు ఓంకారమై ప్రభవిస్తావని..
అవినీతి రాకాసులని భస్మీపటలం చేస్తావని..
హేరాం..!