' ఆ' ఇద్దరు : - టి. వేదాంత సూరి
ఆక్లాండ్ లో కివెడాన్ అనిమల్ ఫారం వుంది. అక్కడ పిల్లలు జంతువులను చూస్త్తూ వాటితో ఆనందిస్తూ ఆడుకుంటారు. గుర్రాలకు గడ్డి తినిపించడం, గాడిదలు, గుర్రాలపై స్వారీ చేయడం ఇక్కడి ప్రత్యేకత .అంటే కాదు కోడి  పిల్లలు, బాతులు, గొర్రెలు కూడా ఉంటాయి సుమారు 20 ఏళ్ళ క్రితం దీన్ని ఏర్పాటు చేశారు  ప్రకృతికి దగ్గరగా వున్నట్టుగా , ఒక అడవి నమూనాలో ఇది ఉంటుంది. జంతు ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు .  ఒక చిన్నారి శర్యాక్స్ పుట్టిన రోజు వాళ్ళ అమ్మ భరణి, నాన్న నిర్మల్ పాండే అక్కడ ఏర్పాట్లు చేశారు.. అక్కడికి అమ్మతో కలిసి ఆద్య, ఆరియా వెళ్లారు. ఆరియా అసలే భయపడకుండా గుర్రం స్వారీ చేసిందట..మిగతా కబుర్లు  చెప్పకుండా కొన్ని ఫోటో లతో ఈ రోజు ముగిద్దాం. (మరిన్ని ముచ్చట్లు రేపు )