సమయ పాలన ...:-------డా .కె .ఎల్వీ .హనంకొండ .

 తెల్లవారగనే 
నిద్రలేస్తా ....
అందరికి 
శుభోదయం 
చెబుతా !
కాల కృత్యాలు 
తీర్చుకుంటా 
బాదంపప్పులు 
తినేస్తా ...
గ్లాసుడు పాలు 
తాగేస్తా ...!
మిద్దెమీదకు 
వెళ్ళిపోతా 
సూర్య కాంతిలో 
స్నానం చేస్తా ...
పరుగులు తీసి ,
సైకిలు తొక్కి ...
చెమట వచ్చేదాకా ,
బంతి ఆట 
ఆడుకుంటా ...
వేడినీళ్ళతో 
హాయిగ 
స్నానం చేసెస్తా !
అమ్మ పెట్టే ..
అల్పాహారం -
తినేస్తా ....
అంతర్జాల చదువుకు 
సిద్దం అవుతా ....!
హాయిగ సమయం 
గడిపేస్తా .....!!
-----------------                       
ఫోటోలో:-బేబీ ఆన్షీ.నల్లి.