ఆత్మీయ తీగలు....: --మొహమ్మద్ . అఫ్సర వలీషా -ద్వారపూడి (తూ గో జి)

 ఆత్మీయ తీగకు వేలాడే
ఆ తీయని ద్రాక్ష గుత్తుల్లా....
ప్రేమనంతా పొదివి పట్టి 
పక్క పక్కనే కూర్చున్న 
అపురూప బంధాల్లా....
అనుబంధాల దారానికి
అల్లబడిన అప్యాయపు సుమాల్లా....
అవనిలోని ఆనందాలను
ప్రేమ తీగకు లతలా 
చుట్టుకునే పాదుల్లా...
ఆశయాల పందిరిలో
ఆశల పన్నీరు జల్లుకునే
జల్లుకునేజీవ నదుల్లా...
నిశీధి తీరంలో
 ఒడిదుడుకులను
తట్టుకునే నింగి నేలల్లా...
జీవితపు చరమాంకం వరకు
ఒకరి కోసమొకరు తోడుండే
అనోన్యపు తోడు నీడలు
ఈ అన్నాదమ్ములు
విజయ ధమదుంధుభి
మ్రోగించే ధనుష్ ప్రణవ్ నాదాలు...