అనాథబాలలం:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

అనాథబాలలం మేమే మేమే
అనాథబాలల అవస్థలు
ఏనాడైనా చూశారా?
అమ్మానాన్నలు ఎవరో ఏమో
తెలియనే తెలియదు మాకు
ఆకలి కడుపుతొ మాడేవారు
రోడ్డు మీద ఈగలమాదిరి
ఎవరిపిల్లలమో ఏమో ఏమో
వానకు తడిసిన
ఎండకు ఎండిన
చలికి వణికిన
గాలికి ఒరిగిన
ఎడారి ఒంటెలం
ఎవరిపిల్లలమో ఏమో ఏమో
కడుపు నొచ్చినా
కాలు నొచ్చినా
జొరం వచ్చినా
రోగం వచ్చినా
కుక్కచావు చస్తాము
ఎవరిపిల్లలమో ఏమో ఏమో
ఎవరో చేసిన తప్పుడు పనులకు
నిజమైన సాక్ష్యం మేమే మేమే
రోడ్డునపడ్డ మా బాల్యంతో
భావిభారతం ఏమౌనో ఏమో !!