చెట్టు ..చెట్టు ..
ఏమి చెట్టు ?
ఎత్తుకి ఎదిగిన
కొబ్బరి చెట్టు !
కాయ ..కాయ ..
ఏమి కాయ ?
శుభకార్యాలకు ,
కొబ్బరికాయ !
నీరూ..నీరూ..
ఏమి నీరూ ?
ఔ షదగుణం గల
కొబ్బరి నీళ్లు..!
కురిడీ..కురిడీ..
ఏమి కురిడీ?
రుచి కోసం
వంటల్లో వాడే,
ఎండు ---
కొబ్బరి కురిడీ!
పువ్వూ..పువ్వూ..
ఏమి పువ్వూ?
కమ్మని-మెత్తని
కొబ్బరి పువ్వూ!
పీచూ ..పీచూ ..
ఏమి పీచు ...?
తాళ్లను పేనే ..
కొబ్బరి పీచు !
ఆకు ..ఆకు ..
ఏమి ఆకు ?
ఇళ్లను కప్పే ..
కొబ్బరి ఆకు ...!
ఈనే ..ఈనే ..
ఏమి ఈనే ?
చీపుళ్ళకు వాడే
కొబ్బరి ఈనే ..!
కమ్మ ..కమ్మా ..
ఏమి కమ్మ ?
పొయ్యిలో మంటకు
కొబ్బరి కమ్మ !
చిప్ప ..చిప్ప ...
ఏమి చిప్పా ?
బొమ్మలు చేసే
కొబ్బరి చిప్ప !
దుంగా..దుంగా..
ఏమి దుంగా..?
వంతె న కోసం
కొబ్బరి దుంగ!
అందుకే....
తోటలో..కొబ్బరి చెట్టు!
వేల రూపాయల
విలువకు సరి తూగు ఒట్టు !!
----------------------------
ఫోటో లో....బేబీ ఆన్షి.నల్లి.