ఆత్మీయ అక్కా చెల్లెళ్ళము మేము ....: మొహమ్మద్ అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి ).

అల్లరికి , అలుగులకు...


 ఆరడుగుల దూరము....


అందరితో ఇట్టే కలిసి పోతాము...


ఆటపాటలలో మెరిసి పోతాము....


అమ్మా నాన్నల 
అరవిరిసిన కుసుమాలము....


ఆనందంగా చదువును 
ఒడిసి పట్టుకుంటాము...


అమ్మమ్మ తాతయ్యల
 ఆరవ ప్రాణం మేము....


 అలవి కాని అనురాగాన్ని  
నానమ్మ తాతయ్యల  కిస్తాము....


అమ్మ కు పనులు 
సాయం చేస్తాము....


అలవాట్లు అన్నీ  
ఆవపోసన పడతాము.....


అన్నిట్లో మేమే 
నం ఒన్ అనిపిస్తాము....


ఆరాధ్య మయూఖాలము....


అన్నిట్లో అసమాన్యులం
 అనిపిస్తాము...