తిరుమలేశ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

ఆపదమొక్కులస్వామీ
అభయమియ్యవయ్యా
బాలలందు కరుణజూపి
మమ్ముబ్రోవుమయ్యా ||ఆపద||
మాపిలుపుకు అందనంత
దూరంలో ఉన్నావయ్యా
మాపిలుపును ఆలకించి
మాదరిని జేరుమయ్యా ||ఆపద||
నీ సన్నిధి మా పెన్నిధి
నీ ధ్యానం మా ప్రాణం
నీ దర్శనమిచ్చి మమ్ము
ఆదుకొన రావయ్యా ||ఆపద||
అభయమూర్తి నీవేనట
అభయహస్త మున్నదట
అభయమిచ్చి మాకున్న
ఆపదలను గావుమయ్యా ||ఆపద||