ఆంజనేయుడు: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

ఆంజనేయుడు మహావీరుడు
బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ||ఆంజ||
ఎక్కడెక్కడ రామభజననో
అక్కడక్కడ తానుంటాడు
కనులు మూసుకుని ఉంటాడు
కైమోడిచి తానుంటాడు
భజనలు చేస్తూ ఉంటాడు ||ఆంజ||
హనుమంతుడి కున్నాది ఒకతోక
తోక కాదు అది యముని దండం
దండం కాదది ఇంద్రుని వజ్రం
వజ్రం కాదది విష్ణుని చక్రం
అన్నీ కలిసిన గొప్ప ఆయుధం ||ఆంజ||
ఆంజనేయుని స్మరించినంతనే
గాలీ ధూళీ పరారు
దయ్యం భూతం పరారు
మన కష్టాలన్నీ పరారు
మన అందరికీ శుభం శుభం ||ఆంజ||