ఎవరబ్బా ఈ మనిషి: సేకరణ : యామిజాల జగదీశ్

"మొట్టమొదట నేను భగవాన్ ఫోటోని sunday times అనే పత్రికలో చూసినప్పుడు "ఎవరబ్బా ఈ అందవికారమైన మనిషి! పెద్ద పొట్టతో, బట్టలు లేకండా ఫోటోలు తీయించుకోవడమే కాక పైగా ఆ ఫోటోలని పత్రికల్లో వేయించుకుంటాడు? అని ఏవగించుకున్నాను. 
ఆయన పేరు భగవాన్ రమణ మహర్షి. 
ఎంతో కటువుగా 
ఆర్టిఫిషియల్ గా ధ్వనించింది 
నా చెవులకి
భగవాన్ కి
రమణకి
మహర్షికీ 
ఈ మూడు పేర్లకీ ఎక్కడా 
సంబంధం లేదు.
ఎడ్వర్ టైజ్ మెంట్ కోసం
తన గొప్ప చాటుకునేందుకు 
ఈ బిరుదులన్నీ 
తగిలించుకున్నాడనిపించింది.
నా ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ 
ఎంత బాధపడేవంటే
చివరికి 
ఆయన ఫోటో 
కనబడితే చాలు
భరించలేక 
ఆ పేజీని త్వరగా తిప్పేసేదాన్ని
నా కళ్ళముందు నించి.


అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు.


కానీ 
ఈనాడు నేను ఫీలవడమే కాదు
నాకు స్పష్టంగా తెలుసు
భగవాన్ సౌందర్యాన్ని మించిన సౌందర్యం
ఈ భూమి మీద
ఎక్కడా లేదని!
సమ్మోహన పరిచే ఆయన చిరునవ్వు
శ్రావ్యమైన కంఠధ్వని
ఆయన తల వూపు
ఈ ప్రపంచపు మాయని చీల్చుకుని 
ప్రకాశించే అద్భుతమైన ఆయన కంటిచూపు
ఆయనలో తప్ప ఇంక 
ఎక్కడ వెతికి చూసిన కానరావు...."


ఈ మాటలన్నీ సౌరిస్ గారివి. భగవాన్ రమణమహర్షి గురించి రాసిన వ్యాసంలోనివీ మాటలు.