ఉనికి ...: ------డా.కె .ఎల్.వి .ప్రసాద్ , హనంకొండ.

ఊరు కి 
వెళ్దామని  ఉంది !


నేను పుట్టిపెరిగిన 
వూరినొకసారి 
చూసిరావాలని ఉంది !


పల్లెటూరి 
ప్రకృతి శోభను 
తనివితీరా ...
ఆస్వాదించి -
రావాలని ఉంది !


పంటకాలువలో 
స్నానం చేసి 
పంటచేను గట్టుమీద 
అరిటాకులో ...
భోజనం -
చేయాలని ఉంది!


లంక ఒడ్డు ....
గోదావరిలో 
లాంచి ఆగమనం 
చూడాలనివుంది !


సంక్రాంతి కాలంలో 
ఇళ్లముందు 
పల్లెపడుచులు పెట్టే 
అందమైన ముగ్గులు 
చూడాలని ఉంది !


కోడిపందాలు ...
నాటకాలు 
రికార్డింగు డాన్సులు 
గంగిరెద్దుల విన్యాసాలు 
చూసి ...
బాల్యాన్ని 
మరోసారి 
బహురూపాల్లో 
చూడాలని ఉంది !


కోర్కెలు ....
గుర్రాలై 
పరిగెడుతున్నాయి .
కానీ ----ఇంతకి 
పల్లెటూళ్ళు --
పల్లెటూళ్లలా 
వున్నాయంటారా !


అప్పటి -
నా ..జ్ఞాపకాలు 
ఇప్పుడు .....
మళ్లీ ----
గుర్తుకొస్తాయంటారా !!