బీట్ రూట్...ఔషధంగా. : - పి .కమలాకర్ రావు

బీట్ రూట్ ముక్కలతో రక్తపోటు, కోలేష్ట్రాల్, మరియు  అధిక బరువు  తగ్గించుకోవచ్చు. బీట్రూట్ ను ముక్కలుగా కోసి కొద్దిగా నల్ల గొట్టిన  వెల్లుల్లిని వేసి నీరు పోసి మరిగించాలి. కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కషాయంగా కాచాలి. ఇది వరుసగా కొద్ది రోజులు తాగితే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.బీట్రూట్ ను తురుము గా చేసి అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, మిరియాల పొడి కొద్దిగా నిమ్మరసం కలిపి భోజనంతోపాటు గా ప్రతి రోజు తింటే క్రమంగా బరువు తగ్గుతారు.మూత్రపిండాల సమస్య(Kidney)  ఉన్నవారు బీట్రూట్ తినకూడదు..బీట్రూట్ రసంగా చేసి తాటి బెల్లం కొద్దిగా యాలకుల పొడి వేసి  మరిగించి చల్లార్చి చిన్న పిల్ల లు త్రాగితే మంచి రక్త వృద్ధి జరిగి బలంగా తయారవుతారు