జై జై భారత్: - :యడ్ల శ్రీనివాస రావుMSw,MTel :విజయనగరం జిల్లా:9493707592
 జయ జయ గీతం పాడెదన్
భారత మాతకు వందనము
తల్లి భరతమాత కు
సంకెళ్లను తెంచి నడిచెదను
నిరక్షరాస్యత నిర్మూలిద్దాం
మద్యపానము అంతం చేద్దాం
ధూమపానము లేకుండా చేద్దాం బాల్యవివాహాలు ఆపేద్దాం
వరకట్న బలులు నిషేధిద్దాం
చట్టాలున్నాయి మన కొరకు
మన అందరినీ కాపాడుటకు
స్వతంత్రతను సాధిద్దాం
భారతమాతకు వెలిగిద్దాం
కోటి వెలుగులతో సందడి చేద్దాం
భావి పౌరులకు సహాయమీద్దాం జయగీతం పాడెద భారతమాతకు మూఢత్వములు తెగనరికి
విశాల ప్రశాంత శాంతిని కోరి
నడిచెదను అయ్యా...!
నడిచెదను అమ్మ...!!
జై బోలో భారత్ మహాన్ హాయ్