జాజికాయ (Nutmeg)-1 ఔషధోపయోగాలు...పి . కమలాకర్ రావు

  వంటింట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన వస్తువుల్లో జాజికాయ కూడా ఒకటి. ఇది రక్తశుద్ధికి తోడ్పడుతుంది. కాలేయానికి బలాన్నిస్తుంది. నొప్పులు, వాపుని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మగవారికి వీర్యకణాలు పెరగడానికి సహాయపడుతుంది.
 జాజికాయ లోపలి గింజను  తీసివేసి జాజికాయను నలగ్గొట్టి నీటిలో వేసి కొద్దిగా సొంటి జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరిగించిన కషా యాన్ని చల్లర్చి భోజనానికి 20 నిమిషాల ముందుగా త్రాగాలి. ఇది కడుపులోని వాయువును తొలగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
జాజికాయ ముక్కల్ని నల్ల గొట్టి నేతిలో వేయించి బాదం పప్పు పొడి ని కూడా కలిపి పాలలో వేసి తాటి బెల్లం కలిపి కొద్దిగా నీరు కలిపి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. దీనివల్ల మూత్రంలో వీర్యకణాలు పోవడం తగ్గుతుంది. వీర్య కణాలు పెరగడానికి సహాయపడుతుంది. ఇది శీఘ్ర స్కలనం కాకుండా ఉండడానికి మంచి మందు.