అమ్మ ...!మమ్మీ ..!!:--డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,-హనంకొండ.

మమ్మీ ..మమ్మీ ..!


అమ్మ ..అనిపిలిస్తే 
కోపమా నీకు ...!


పొనీ ...ఇంట్లోఅమ్మా
అనిపిలుస్తా ...
బయట మమ్మీ 
అని పిలవమంటావా !


'అమ్మ ' పిలుపులోనే 
ఆనందం నాకు ..!


అమ్మ అంటేనే ...
కడుపునిండినట్లు ..
అమ్మ ..అని పిలిస్తేనే 
ఏదో ..తెలియని 
తృప్తినాకు ...


అమ్మే ..కావాలి నాకు !
మమ్మీ ..అనిపిలవడానికి 
నోరు రావడం లేదు -
నా ..బాధను 
ఎలా చెప్పాలి నీకు ...!!
-------------------------------
ఫోటోలో....బేబీ..ఆన్షి.నల్లి*