ఎవరి కోసం.: ---డా.కె .ఎల్వీ --హనంకొండ .

చాక్లెట్లు తింటా 
అంటానా.
అమ్మో వద్దు 
పళ్లు పుచ్చిపోతా య్
అంటారు!


బిస్కెట్లు తింటా,
అంటానా...
అమ్మో వద్దు
పళ్లకు-
 అంటుకుంటాయ్
అంటారు..!


కేకు తింటా 
అంటానా ...
అమ్మో వద్దు 
లావెక్కి పొతావ్
అంటారు ...!


ఐస్ క్రీం తింటా
అంటానా...
అమ్మో వద్దు ,
జలుబు చేస్తుంది
అంటారు ...!


కూ ల్ డ్రింక్
తాగుతా అంటానా
అమ్మో వద్దు 
ఆరోగ్యం --
పాడవు తుంది
అంటారు....!


మరి ----
ఇవన్నీ ఎవరికోసం?
పిల్లలకోసం
యెమున్నాయో ..
చెప్పరూ నాకోసం ..!!
-------------------------
ఫోటో లో: బేబీ..ఆన్షి.నల్లి.