కుబేరుడు. పురాణ కథ.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

నవబ్రహ్మలుగామారీచి,అత్రి,అంగీరసుడు,పులస్యుడు,పులహుడు, క్రతువు,భృగువు,వసిష్ఠుడు,అధర్వుడు అనిచెప్పుకుంటారు.కర్ధమమహర్షి భార్య దేవహుతి వీరి కుమార్తెలు తొమ్మిదిమంది.వీరిని మారీచిమహర్షికి కళ,ఆత్రిమహర్షికి అనసూయ,ఆంగీరసునికి శ్రధ్ధ,పులస్యునికి హవిర్బువును, పులహుడికి గతిని,కత్రువుకు క్రియను,భృగునకు ఖ్యాతిని,వసిష్ఠునకు అరుంధతిని,అధర్వుడికి శాంతిని ఇచ్చి వివాహం జరిపించాడు.తృణబిందు ఆశ్రమంలో తపస్సు చేసుకోసాగాడు పులస్యుడు.ఒకరోజు ఇద్దరు దేవకన్యలు తృణబిందు ఆశ్రమ వనంలోని పూదోటలో విహరిస్తూ తమ ఆటపాటలతో ఆనందకేరింతలతో పులస్యునకు తపోభంగం కలిగించారు.కోపించిన పులస్యుడు ఆశ్రమంలో తనకంటపడిన ఏయువతి అయినా గర్బవత ిఅవుతుందనిశపించాడు.ఈవిషయంతెలియని తృణబిందుకుమార్తే'ఇలబిల'పులస్యుడికంటపడిగర్బవతిఅవుతుంది. అందుకుతృణబిందుతనకుమార్తెనుపులస్యునికేఇచ్చివివాహంచేస్తాడు.వారికి'విశ్రవసువు'అనేకుమారుడు జన్మిస్తాడు.ఆవిశ్రవసుడు కాలక్రమంలో 'దేవవర్ణి' అనేఆమెనువివాహంచేసుకున్నాడు.వారికి'కుబేరుడు'జన్మించాడుఘ.సుకేసుని కుమారుడు 'సుమాలి' ఇతను 'కేతుమతి'ని వివాహం చేసుకున్నాడు. వీరికి'బాలపుష్పత్కట''కైకసి''కుంభీనస' జన్మించారు.సుమాలి తమ్ముడు'మాలి' విశ్రవసుడు 'కైకసి'ని వివాహంచేసుకోగా 'రావణుడు' జన్మించాడు. అలారావణుడు కుబేరునికి సోదరుడు అయ్యాడు. కుబేరుడుయక్ష,కిన్నెర,గుహ్యకులకు,సంపదకు అధిపతి.ఉత్తర దిక్కున ఉన్న అలకాపురి ఇతనిరాజధాని.ఇతని భార్య 'చిత్రరేఖ' ఈమెకు రిధ్ధి,యక్షి,చర్వి కావేరి,చిత్రాణి అనేపేర్లుకూడా ఉన్నాయి.'పుష్పదంటుడు''మణికంఠడు'అనేవారు.కుబేరుని కుమారులు.అష్టదిక్పాలకులలోకుబేరుడు  ఒకడు.మయుడు నిర్మించిన ఇచ్చిన పుష్పకవిమానంలో ఇతనువిహరిస్తూ ఉండేవాడు. పార్వతిదేవిశాపంతోఅందవికారుడిగా,ఒకకన్నుకోల్పోయాడు.సవతితల్లులబిడ్డలు,ఇతనిసోదరులు రావణ,కుంభకర్ణ,విభీషణులు.సత్ ప్రవర్తన లేనందున రావణుని మందలించిన కుబేరుని పైయుద్దంచేసిఅతనిసంపదను,పుష్పకవిమానాన్నితీసుకుంటాడు రావణుడు.పులస్యబ్రహ్మను ఆశ్రయించిన కుబేరుడు శివునిగూర్చి తపస్సుచేసి వరాలు పొంది మరలాధనాధిపతి అయ్యడు.కుబేరుడు అశ్వంపైన ఉన్నట్లు అనంతపురం లోని 'లేపాక్షి దేవాలయంలో చిత్రితమైయింది.