చిలకలు కొట్టిన జామపండు అంటే ఇష్టం:-కె స్వాప్నిక్ సింధూర్

మాకు సెలవులు రాగానే వెంటనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం సంవత్సరమంతా కష్టపడి చదివినందుకు రిలాక్స్గా సెలవుల నీ సంతోషంగా గడుపుతాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్లు చెట్లు ఉంటాయి మేము ఎలాగూ వేసవికాలంలో వెళతాం కాబట్టి కొబ్బరి బోండాలు కొట్టే నీళ్లు తాగుతాం నేను మా అన్నయ్య కొబ్బరి నీళ్లు తాగుతూ అందులో పంచదార తింటే ఆ టేస్టే వేరు మేము కొబ్బరి నీళ్లు తాగుతూ నే ఉంటాం ఇంకా   జామ చెట్టుకు పెద్ద పెద్ద కాయలు కాస్తాయిమేం వచ్చేసరికి తినటానికి జామకాయలు ఉండాలని మేము రాకముందు నుంచే ఎవరూ కాయలు చేయకుండా జాగ్రత్త పడుతుంది మా అమ్మమ్మ ఎంత జాగ్రత్త పడిన చిలుకలు మాత్రం ఉంటాయి జామ కాయలు తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి  అమ్మమ్మతోకలిసి సన్నజాజులు కొయ్యటం  వాటిని  అమ్మ అల్లుతూ ఉంటే చూస్తూ ఉంటే చూడటం మాకు సరదాగా ఉంటుంది.
            ఈ రోజు మధ్యాహ్నం మల్లెపూల మీ దగ్గర అమ్మమ్మ మల్లెపూలు కొంటుంది ఆ పూలు అన్నీ సూదితో దండ గుచ్చడం నేర్చుకున్నాం పోయినసారి సెలవులకు వచ్చినప్పుడు ఈ పూలు గుచ్చటం మాకు అమ్మమ్మ నేర్పించింది ది ఒకసారి మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మంచానికి నవారు అల్లుతూ ఉన్నది నవారు పట్టీలు ఒకటి విడిచి ఒకటి మరొక దానిలో అల్లు తుంటే మధ్యలో కన్నా లు గా వస్తాయి మేము కూడా చాలా కష్టపడి మంచానికి నవారు అల్లడం నేర్చుకున్నాం ఈ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.
                కరెంటు పోయినప్పుడు అమ్మమ్మ లాంతరు వెలిగిస్తుంది అక్కడ అ అమ్మమ్మకు మా ఇంట్లో లాగా జనరేటర్ లేదు దు ఆ లాంతరు వెలిగించడం తమాషాగా ఉంటుంది దానిని తెరవటం మూయటం ఒత్తిని పెంచడం తగ్గించటం అంటే మా అన్నయ్యకు చాలా సరదా. అలా వత్తిని పెంచుతూ తగ్గిస్తూ ఒక్కోసారి ఒత్తి లోపలికి పడేసి అమ్మమ్మతో చివాట్లు తింటూ ఉంటాడు ఇంకా నీళ్ల మోటార్ ఆన్ చేసుకొని పైపుతో స్నానాలు చేయడం అంటే మాకు చాలా ఇష్టం .
               అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సముద్రం ఉంటుంది మాకు ఈ సముద్రం అంటే చాలా ఇష్టం సముద్రం దగ్గరకు వెళ్లి అలలతో నీళ్లతో ఆటలాడటం మాకెంతో సరదా ఎందుకంటే మా ఊర్లో సముద్రం లేదుగా ఇంతకీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఏమనుకుంటున్నారు ప్రకాశం జిల్లా చీరాల మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మేము అక్కడ వున్నన్ని రోజులు ప్రతిరోజూ సముద్రానికి తీసుకువెళ్ళమని అమ్మను అడుగుతూనే ఉంటాం అక్కడ అలలతో ఆడుకోవడమే కాదు ఆ ఇసుకలో దొరికే గవ్వలు కూడా వస్తాం వాటిని భద్రంగా మా ఊరు తెచ్చుకుంటాం మా అమ్మ ఆ గవ్వలతో ఎన్నో అందమైన బొమ్మలు చేస్తుంది.
                ఇంట్లో లో ఉన్న అంత సేపు టీవీ చూడటం చాలా ఇష్టం ఇంకా చిన్నప్పుడు అమ్మ కు వచ్చిన ప్రైజులు చూడడమంటే ఇంకా ఇష్టం అమ్మ అ చిన్నప్పటి ఫోటోలు చూసి ఆ ఫోటోలో లాగా ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరున్నారు చూసుకోవటం చాలా సరదాగా ఉంటుంది అమ్మకు రాని వంటకాలు అమ్మమ్మతో చేయించుకొని తినటం పసందుగా ఉంటుంది అబ్బో ఎన్నో సరదాలు వేసవి సెలవుల్లో.