ఆదర్శ మూర్తి అంబేడ్కర్ ..: - ----డా.కె .ఎల్వీ .-హనంకొండ.

పిల్లల్లారా ...
పాపల్లారా ...
బుడి ..బుడి 
నడకల -
బుజ్జాయిల్లారా ,
భవితను మంచిగ 
మలచుకునే ...
రేపటి భారత 
పౌరుల్లారా .....!


విన్నారా ..
విన్నారా ...
బాల అంబేడ్కర్ 
చదువుల కోసం ,
పడిన బాధలు ,
విద్యాభ్యాసంలో 
సాధించిన ....
విజయ గాథలు !


విన్నారా ..
విన్నారా ...
కులవివక్షతలో 
కష్టాలకోర్చి ...
విజ్ఞాన సముపార్జనలో 
సాధించిన --
అంతర్జాతీయ ,
విజయ గాథలు !


అందరికి ఆమోదమైన 
నవరాజ్యాంగ నిర్మాత 
మన తొలి ...కేంద్ర ,
న్యాయ శాఖా మంత్రి !


అందరూ 
తెలుసుకోవాల్సిన 
ఆదర్శమూర్తి ...
విజ్ఞాన స్పూర్తి 
మన భారతరత్నం 
బి.ఆర్ .అంబెడ్కర్ 
జీవిత చిత్రం ....!!