తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యాసంస్థలు తెరుచుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 9 వతరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు సిఎం ప్రగతి భవన్లో సోమవారం మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, అటవీశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో కెసిఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో సీఎం విద్యాసంస్థల పునః ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో ఫిబ్రవరి 1న బడి గంట