భాస్కర శతకము - పద్యం (౧౦౫ - 105)

  చంపకమాల: 
 *స్ఫురతరకీ ర్తిమంతులగు | పుత్రుల గాంచిన గాక మూఢ ము*
*ష్కరులఁ గనఁగ దేజములు | గల్గవుగా; మణికీలితాంగుళా*
*భరణము లంగుళంబుల శు | భస్థితిఁ బెట్టినగాక గాజుటుం*
*గరములు పెట్టినందున వి | కాసము గల్గునటయ్య? భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
చక్కగా ప్రయోజకులై, కీర్తి చే ప్రకాశించే సంతానాన్ని చూచినప్పుడు తల్లితండ్రులకు కలిగే ఆనందం, వచ్చే గౌరవం జ్ఞాన హీనులై, బుద్ధిలేక నడచుకునే పిల్లలను చూచినప్పుడు కలుగదు.  ఎలాగంటే, వజ్రాలు పొదిగిన ఉంగారలను చేతి వేలికి పెట్టుకున్నప్పుడు వచ్చే శోభ, అందం, గాజు రాళ్ళ ఉంగారాలు పెట్టుకుంటే రాదు కదా.  .....అని భాస్కర శతకకారుని వాక్కు
*మూర్తీభవించిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్ర మూర్తి ని చూచి దశరథుడు, ఘనమైన కీర్తి ని గడించిన పాండవులను చూచి ద్రోణాచార్యుడు పొందిన అనుభవం, ఇప్పుడు మన మధ్య గరికపాటి నరసింహారావు గారు తన కుమారుడు గురజాడ ను చూస్తూ పొందుతున్న అనుభవం* పైన కవి చెప్పిన కోవలోకే వస్తాయి.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss