తెలుగు వెలుగు సంచికలో వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నా అనుభూతులూ, అనుభవాలు,ఆలోచనలను పొందుపరిచారు.ఇంటర్వ్యూకి 'పర్యావరణానికే ప్రాధాన్యం'అనిపేరు పెట్టారు.అవార్డు ప్రకటన విని నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ ఎ.ఎన్.జగన్నాధశర్మగారు ఫోన్ లో అభినందనలు తెలిపి మా స్టాఫ్సభ్యులు రామ్మోహన్ గారు మీతో ఫోన్ఇంటర్వ్యూ తీసుకుంటారు సహకరించండనికోరారు.శ్రీ రామ్మోహన్ గారు చాలా సేపు ఇంటర్వ్యూ చేశారు. చాలా వివరాలు నా నుంచిసేకరించారు.సినిమాల్లో కవిపాత్రలే స్ఫూర్తి,పర్యావరణమే ఇష్టమైన వస్తువు, టీచర్ ఉద్యోగమే ప్లస్ పాయింట్, కథలే పాఠ్యాంశాలు,బహుమతులు పురస్కారాలు, సెల్ ఫోన్ వద్దు -పుస్తకమే ముద్దు, కుటుంబం శీర్షికలతో ఇంటర్వ్యూ జూలై 10 సంచికలో వచ్చింది.ఇంటర్వ్యూకి పేరు "మాతృభాష మనుగడకుబాలసాహిత్యమే శరణ్యం"అని ఉంచారు.ముఖచిత్రం పేజీలో "బెలగాం భీమేశ్వరరావు ఇంటర్వ్యూ"అని పేర్కొన్నారు.అల పత్రికకు " కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్యపురస్కార్ విజేత శ్రీ బెలగాం భీమేశ్వరరావుగారితో ముఖాముఖి" పేరుతో ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ శివ్వాం ప్రభాకరం గారు ఇంటర్వ్యూ చేశారు.మీకు రచయితనవ్వాలనే కోరిక ఎలాకలిగింది?మీ ఇంటి వాతావరణం రచయితగాతయారు కాడానికి ఏమైనా తోడ్పడిందా?బాలసాహిత్యం లో అడుగు పెట్టడానికి కారణమేమిటి?బాలల అకాడమీ నిర్వహించినబాలసాహిత్య రచయితల శిక్షణా శిబిరం లోపాల్గొన్నారు కదా.ఆ విశేషాలు చెప్పండి?మీరుపొందే బహుమతులు,అవార్డులు చెప్పండి?మీకుటుంబం లో ఎవరైనా రచయితలు తయారయ్యారా?బాలసాహిత్యం పై మీ అభిప్రాయం చెప్పండి? ఇలాంటి ప్రశ్నలతోఇంటర్వ్యూ చేశారు. ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం వారు ఇంటర్వ్యూ చేసి ప్రసారంచేశారు.ఆ రోజుల లోనే ప్రముఖ పాత్రికేయులుశ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసి తెలుగు1రేడియో. కామ్ లోప్రసారం చేశారు. ఆ ఇంటర్వ్యూ విజయనగరం లో ఉన్న ప్రముఖ పుస్తక ప్రియులు కవి శ్రీ నాలుగెస్సుల రాజు గారి గృహంలో జరిగింది.సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగాభక్తి సమాచారం పత్రిక సంపాదకులు జూలై సంచికలో 'భీమేశ్వరరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు'పేరిట వ్యాసం ప్రచురించారు.ప్రముఖ కవి,బాలసాహితీవేత్త శ్రీ కిలపర్తి దాలినాయుడు గారు అవార్డు పొందిననా పుస్తకం పేరును అంతర్లీనంగా ఉంచుతూ'తాత మాట' బాలసాహిత్యానికి 'వరాల మూట'అనే వ్యాసం రాశారు. ఆ వ్యాసం జూన్ 17సోమవారం ప్రజాశక్తి దినపత్రికలో అక్షరం శీర్షికనవచ్చింది. ప్రముఖ విమర్శకులు, యువకవి శ్రీజాని తక్కిడశిల గారు ' బాలసాహిత్య తోటలోబెలగాం కథావృక్షం ' శీర్షికతో వ్యాసం రాశారు.ఈ వ్యాసం ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చింది.డా.పత్తిపాక మోహన్ గారు 'ఆకుపచ్చని కథలతాత బెలగాం భీమేశ్వరరావు' అనే వ్యాసం రాశారు.ఇంటర్వ్యూలు చేసిన పాత్రికేయులకు వ్యాసాలు రాసి పత్రికలకు ప్రచురణార్థం పంపిన రచయిత మిత్రులకు కృతజ్ఞతలు.(సశేషం)
234.ఇంటర్వ్యూలు - వ్యాసాలు::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి