చెన్నై బయలుదేర వలసిన రోజు!చెన్నై మాకుకొత్త కాదు.మా అబ్బాయి అక్కడ తొమ్మిదేళ్లుపనిచేశాడు. ఆ సమయంలో ప్రతి సంవత్సరంఅక్కడకు వెళ్లి ఒకటి రెండు నెలలు గడపడంమా ఆలూమగలకు అనుభవమే.మధ్యాహ్నం 3 గం.కు ఫ్లైట్. ఒంటిగంటకు కేబ్ బుక్ చేసుకుని మా అబ్బాయి ఉండే అత్తాపూర్ నుంచి శంశాబాద్విమానాశ్రయం చేరుకున్నాం.ఎయిర్ పోర్టులోఫార్మాలిటీస్ పూర్తయ్యాక 3 గం.కి విమానం లోకూర్చున్నాం.మా చుట్టుపక్కల సినిమా నటులు,బుల్లితెర నటులు కనిపించారు.మేము కూర్చొన్న10 నిముషాలకు విమానం బయలుదేరింది.సాయంత్రం 4.30 కి చెన్నై విమానాశ్రయం లోదిగాం.బయటకు వచ్చి కేబ్ బుక్ చేసుకొనిమాకు బస ఏర్పాటు చేసిన ది రెసిడెన్సీ హోటల్చేరుకున్నాం.రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళివివరాలు చెప్పగా వాళ్ళు రూమ్ చూపించారు.ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ అది.సదుపాయాలుబాగున్నాయి. కొంతసేపు రూమ్ లో విశ్రాంతితీసుకుని రిసెప్షన్ హాలులోకి వచ్చాం.అక్కడ చాలా హడావుడిగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచిరచయితలు చేరుకున్నారు. హిందీ మాట్లాడడంరాదు నాకు.ఇంగ్లీష్ లో ఒకరికొకరు పరిచయాలుచేసుకున్నాం.వివిధ భాషలు,వివిధ మతాలు,వివిధవేషధారణలు,వివిధ ఆప్యాయతా ధోరణలు కనిపించే ఆ హాలు భారతదేశాన్ని ప్రతిబింబించింది.గుంటూరు లోను విశాఖపట్నంపట్టణంలోను విజయవాడలోను జరిగే సాహిత్య అకాడమీ కార్యక్రమాలలో పరిచయమయ్యేఅకాడమీ ఉద్యోగులు కనిపించారు.హోటల్ లోసమకూర్చే సదుపాయాలు చెప్పారు. అక్కడ నుంచి హోటల్ బయటకు వచ్చాం.ఫోటో దిగాకరిసెప్షన్ హాలు పక్క నున్న రెస్టారెంట్ హాల్ కివెళ్ళాం.పదుల సంఖ్యలో రకరకాల వంటకాలుఉన్నాయి.అన్నీ వేడి వేడి పదార్ధలే.ఎవరికి నచ్చినవి వాళ్ళు ఎంచుకొని తీసుకుంటున్నారు.తింటున్నారు. మాకు నచ్చిన వంటకాలు వేసుకునిడిన్నర్ చేసి రూమ్ కి చేరుకున్నాం.అంతలో ఫోన్రింగయింది.రీసీవ్ చేశాను.డా.మంచిపల్లి శ్రీరాములు గారు ముందస్తు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నుంచి పార్వతీపురంప్రయాణమెప్పుడని అడుగుతూ డిశంబరు 8నపార్వతీపురంలో సాహితీలహరి తరుపునఅభినందనసభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అప్పుడే మరొక ఫోన్ సాలూరు నుంచి వచ్చింది. డిశంబరు 8 సాయంత్రం సాలూరుమిత్రబృందం వారి అభినందనలు అందుకోడానికిరావలసినదిగా ఆ సంస్థ నిర్వాహకులు శ్రీకిలపర్తి దాలినాయుడు గారు శ్రీ జె.బి.తిరుమలాచార్యులు గారు కోరారు. ఆ తరువాత కొద్ది సేపటికి విజయనగరం నుంచి ఫోన్ వచ్చింది. శ్రీ నరసింహం ఫౌండేషన్, సరోజినీ మహిళామండలి మరియు మోహన్ స్మారక గ్రంథాలయంసంస్థలు వారి తరుపున "శ్రీ పి.మోహన్ పురస్కారం"శ్రీ నరసింహం ఫౌండేషన్ కార్యదర్శిశ్రీ జె.వి.ఎస్. ప్రసాద్ గారి ద్వారా అందజేస్తామనిఅందుకు అంగీకారాన్ని తెలుపవలసిందిగాకోరుతున్నామని 2020 జనవరి 7న పురస్కారప్రదానోత్సవం జరుగుతుందని ఫౌండేషన్ఉపాధ్యక్షులు శ్రీ పి.రామానుజం గారు మరియుసరోజినీ మహిళామండలి అధ్యక్షురాలు శ్రీమతిఈశ్వరీమోహన్ గారలు కోరారు. వాళ్ళకంగీకారంతెలిపాను(సశేషం)
237.చెన్నై ప్రయాణం:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.