ఉపాధ్యాయపర్వం-47: --సంక్రాంతి శుభాకాంక్షలతో:-- రామ్మోహన్ రావు తుమ్మూరి


 మొదట్లోనే చెప్పాను రాస్పల్లి మా స్వంత ఊరును తలపించేదిగా ఉందని. అక్కడ పనిచేసిన మూడు సంవత్సరాలలో ప్రతిరోజూ ఫలవంత మైన దినంగానే అనిపించిది.పిబిసి హెడ్ మాస్టర్ గా ఉన్నరోజుల్లోనే పిబిసి క్రింద ఉన్న మోసం,ఆరెగూడ, గజ్జిగూడ, సీతానగరం,సార్సాల,గెర్రెగూడ,పోతేపెల్లి,గొంట్లపేట,జంబుగ అన్ని ఊళ్లూ తిరిగాను.ఆ  స్కూళ్లలో పని చేసే టీచర్ల సాధక బాధకాలు చూసాను.దాదాపు అన్ని స్కూళ్లకు ఒర్రెలు,రేగడి దారుల ఇబ్బందులే.వర్షాకాలం ఇబ్బందులు చెప్పనలవి కావు.నా పిబిసి లోని దాదాపు అందరు టీచర్లు ఎంతో ఆదరం తో ఉండేవారు.వారితో గడిపిన ఒక ఏడాది కాలం చాలా సంబరంగా గడిచింది.పేర్లు గుర్తు తెచ్చుకుం టున్నాను.గొంట్లపేట-సునీత టీచర్,పోతేపల్లి-రాజ్యలక్ష్మి టీచర్,సార్సాల-రాజాలు సార్,గెర్రెగూడ-హమీద్ సార్,రాస్పల్లి-మాలతి టీచర్,టీచర్ ,అనూరాధ టీచర్,బడుగు శ్రీనివాస్ సార్,శుభాకర్ సార్ , జెడ్పీ అయిన తర్వాత నరేందర్ రెడ్డి సార్ ,సునీత టీచర్, శారద టీచర్,విద్యా వలంటీర్లు రమణయ్య,తిరుపతి, లింగయ్య (ఈయన తరువాత నేనక్కడి నుంచి వచ్చిన తరువాత సర్పంచ్ అయ్యాడు), గజ్జిగూడ-రాజేందర్ సార్,జంబుగ-బుచ్చిరాములు , మోసం-నిర్మలటీచర్, ఆరెగూడ-కిష్టాగౌడ్ సార్,సీతానగరం-అరుణ టీచర్,ఒక  సార్ దేవసహాయం సార్- జంబుగ చనిపోయారు అప్పట్లోనే. కరుణాకర్ సార్  ప్లేస్ గుర్తులేదు. హేమ వాణి -నాగంపేట.ఇంకా ఒకరిద్దరెవరో ఉండాలి గుర్తు వస్తే చెబుతాను.అవి మరపు రాని రోజులు.

ఇందులో ఒకరిద్దరు ఇప్పుడు లేరని తెలిసింది.పాత టీచర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.