ప్రేమతో జయించు: -కె.రాణి తిరుమలదేవి.8వ తరగతి .కొత్తపేట

 ఉప్పలపాడు అనే ఊరిలో సుమతి,సుశీల
ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.ఏదో
చిన్న విషయానికి వారి మధ్య మాటలు లేవు.
సుమతికి పట్టింపులు ,శత్రుత్వం ఇష్టంలేదు. మాట్లాడాల ని ప్రయత్నించినా
సుశీల మాట్లాడలేదు.సుశీలతో కలిసి కొందరు విద్యార్థులు గ్రూపు కట్టారు.సుమతి
వైపు కొందరు చేరారు.పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియకుండా రెండు
గ్రూపులుగా విడిపోయారు.సుమతి తనచదువేదో తాను చదువుకంటూ ఉండేది.
ఒకసారి సుశీలకు విపరీతమైన జ్వరం
వచ్చింది.డాక్టర్లు టైఫాయిడ్ జ్వరమని చెప్పారు.బడికి రాలేక ఇంట్లో ఉండిపోయింది.ఈ విషయంతెలిసిన సుమతి తాను పొదుపు చేసిన డబ్బుతో ఆఫిల్ పండ్లు,ద్రాక్ష పండ్లు,చీనీకాయలు తీసుకొని
తనమిత్రులతో కలిసి వెళ్ళింది.సుశీల చేతిలో చేయివేసి ఆప్యాయతతో క్షేమసమాచారాలడిగింది .ఆరోగ్య జాగ్రత్తలు
చెప్పింది.
సుమతి మంచితనానికి ,ప్రేమకు సుశీల కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
తర్వాత ఇద్దరూ కలిసి పోయారు.ఇప్పుడు
ఆ పాఠశాలలో గ్రూపులు లేవు.
ప్రేమతో శత్రుత్వాన్ని జయించవచ్చు.
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంలోని కథ)