అపకారికి ఉపకారం: -సి.సురేఖ.8వ తరగతి.కొత్తపేట

 రామాపురంలో రవి,రాజు ఉండేవాళ్ళు.ఆఊరిలో ఉన్నత పాఠశాల లేదు.పొరుగునున్న కొత్తపేట పాఠశాలకు నడిచివెళ్ళి చదువుకునే వాళ్ళు.
ఒకరోజు దారిలో ఒక కుక్కవారిని చూసి మొరిగింది.కరుస్తుందనే భయంతో పరుగెత్తారు.కుక్క వెంటబడింది.దానికాలులో ముళ్ళు దిగడంతో ఆగిపోయింది.కుయ్యో…మొర్రో అంటూ అరుస్తోంది.వెనుదిరిగి చూసిన ఇద్దరూ ఏం జరిగిందోనని దగ్గరకెళ్ళి
చూశారు. అది బాధగా
మూల్గుతోంది.రవి కుక్క తల నిమురుతూ పట్టుకొన్నాడు.రాజు ముళ్ళును తీసేశాడు.కుక్క వాళ్ళను విశ్వాసంగా చూసింది.కాలును నాక్కుంటోంది.
"మాఇంట్లో ఆయిట్ మెంట్ ఉంది.తెచ్చి పూద్ధాం"  అన్నాడు రవి.
"అవసరంలేదులేరా.కుక్క నాలుకతో నాక్కుంటే గాయం తగ్గిపోతుందని ఎవరో చెప్పగావిన్నాను.పెద్దగాయం కాదుకదా!" అన్నాడు రాజు.
వారు ఎంతో తృప్తితో బడికెళ్ళారు.
విషయం తెలిసి ఉపాధ్యాయులు వారిని
అభినందించారు.
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు సంకలనంనుండి)