అన్నా-చెల్లెలు: --అంజలి 8వతరగతి కొత్తపేట

 చంద్రగిరి లో మృదుల అనే అమ్మాయి ఉండేది. ఆ పాపకు మధు అనే అన్న ఉన్నాడు. ఇద్దరూ కొత్తపేట ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నారు.
ఒకరోజు ఆ పాప అమ్మ కూరగాయలు తెమ్మని
యాభై రూపాయల నోటు,సంచి ఇచ్చింది".అలాగే అమ్మా" అని బయలు దేరిందిమృదుల.సంచి,
డబ్బు ఒకే చేతిలో పట్టుకోవడం వల్ల చేయి మార్చుకోవటంలో యాభై రూపాయల కాగితం ఎక్కడో పడిపోయింది.మృదుల గమనించలేదు.
కూరగాయల సంత దగ్గరకెళ్ళాక చూసుకుంటేడబ్బులేదు.వెనుదిరిగి దారి వెంట వెదికింది.కనిపించలేదు.ఏం చేయాలో అర్థంకాలేదు.ఇంటికెడితే అమ్మ చితకతంతుందని ఒక చెట్టు క్రింద ఏడుస్తూ కూర్చుంది.
ఎంతసేపటికి మృదుల రాకపోయేసరికి ఆ పాప అమ్మ మధును వెళ్ళి చూసి రమ్మంది.
"అలాగే అమ్మా" అని బయలుదేరాడుమధు.దారిలో చెట్టుక్రీంద ఏడుస్తున్న చెల్లెలు కనిపించింది.ఎందుకేడుస్తున్నావని అడిగాడు.అన్నకు
చెప్పటానికి తటపటాయించింది."ఏం జరిగిందో చెప్పు.నేను నీకు సహాయం చేస్తాను"అన్నాడుమధు.డబ్బు ఎక్కడో పడిపోయిన విషయం చెప్పింది."
ఏడ్వకు"అని కళ్ళు తుడిచాడు.నాతో రా!వెదుకుదాం"అన్నాడు.ఇద్దరూ వెదుకు
తూ ఇంటి దగ్గరకు చేరుకున్నారు."ఇక్కడే ఉండు" అని మెల్లిగా ఇంట్లో కెళ్ళాడు.అమ్మ వంట గదిలో ఉంది.పుస్తకాల గూటి దగ్గరకెళ్ళాడు.తాను విహారయాత్రకెళ్ళటానికి పొదుపు చేసుకున్న యాభైరూపాయలు తీసుకుని బయటకొచ్చాడు.
చెల్లెలితో కలిసి వెళ్ళి కూరగాయలు తెచ్చి మిగిలిన చిల్లర,కూరగాయలు అమ్మ కిచ్చాడు.
తనకోసం అన్న చేసిన సహాయానికి మృదుల చలించిపోయింది.అన్నకు కృతజ్ఞతలు చెప్పింది.
"రేపు అమ్మకు జరిగిన విషయం చెబుదాం" అన్నాడుమధు.సరేనందిమృదుల.
మరునాడు ఇద్దరూ కలిసి అమ్మకు డబ్బు పోగొట్టుకున్న విషయం చెప్పారు.తన పొదుపు డబ్బుతో కూరగాయలు తెచ్చిన విషయం చెప్పాడు మధు.
"అమ్మా ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.ఇకముందెప్పుడూ తప్పు జరగకుండాజాగ్రత్తగాఉంటాను"అందిమృదుల.పిల్లలనిజాయితీకిమురిసిపోయిందిఅమ్మ 
(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథా సంకలనంలోని కథ )