అమ్మ ప్రేమ: -బి.ధనలక్ష్మి .8వతరగతి.కొత్తపేట


 అనగనగా ఒక ఊరు.ఆ ఊరి లో రంగయ్య,గౌరి అనే దంపతులుండే వాళ్ళు.

వాళ్ళకి ఇద్దరు కూతుర్లు.పెద్ద పాప పేరు సీత.వాళ్ళు పేదవాళ్ళు.పనికి పోతూ ఇద్దరినీ బడికి పంపిస్తున్నారు.

ఒకసారి ప్రమాదం జరిగి రంగయ్య చనిపోయాడు.కుటుంబం కోసం గౌరి ఒక్కతే

కష్టపడేది.

ఒకరోజు పాఠశాలలో విహారయాత్రకెడుతున్నారని సీత అమ్మ ను

డబ్బడిగింది.గౌరమ్మ డబ్బు  లేదంది.సీత అమ్మ మీద కోపంతో మాట్లాడటం మానుకుంది.పిలిచినా పలికేది కాదు.

ఒకసారి సీతకు విపరీతమైన జ్వరం వచ్చింది.సీతను ఎవరూ పట్టించుకోలేదు.

గౌరమ్మ పని మానుకుని ఆస్పత్రికి తీసుకెళ్ళి

చూపించింది.మందులు కొని తెచ్చి రాత్రీపగలు దగ్గరుండి సేవలు చేసి కాపాడుకుంది.

ఈ ప్రపంచంలో పిల్లలను అమితంగా ప్రేమించేవాళ్ళు,వాళ్ళ కష్టాలను పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అమ్మ నాన్న మాత్రమే!"అని సీత గ్రహించింది.


(డి.కె.చదువులబాబుసంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు కథాసంకలనంనుండి)