సంక్రాంతి పర్వదినమంటే... :---- పోలయ్య కవి కూకట్లపల్లి--అత్తాపూర్ హైదరాబాద్...9110784502


 సంక్రాంతి పర్వదినమంటే...

ఊరినిండా పాడి పంటలు... 

భోగి మంటలు

ఇంటినిండా పిండివంటలు...

కొత్త జంటల కోలాహలమే...


సంక్రాంతి పర్వదినమంటే..... 

గంగిరెద్దులు... 

గాలిపటాలు

కొత్త అల్లుళ్ళు.‌‌.. 

కోడిపందాలు

ముసిముసి నవ్వులు...

ముత్యాల ముగ్గులు...

బసన్నల విన్యాసాలు...

హరిదాసుల వినోదాల విందులే...


సంక్రాంతి పర్వదినమంటే... 

పచ్చనిపాడిపంటలు...

గాదెలనిండా నవధాన్యాలు...

సిరిసంపదలు... చిరునవ్వులు

భోగభాగ్యాలు శాంతి సౌభాగ్యాలే...


సంక్రాంతి పర్వదినమంటే....  

జీవితాన 

ఏ విషాదంలేని...

ఏ విపత్తులురాని... 

ఏ మొండివ్యాధులు వెంటపడని

చక్కని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలే..

చదివినవారికి సంక్రాంతి శుభాకాంక్షలే....