భాస్కర శతకము - పద్యం (౯ - 99)

 చంపకమాల: 
 *సరసదయాగుణంబుగల | జాణమహిం గడునొచ్చి యుండియుం*
*దరచుగ వానికాసబడి | దాయఁగవత్తురు లోకులెట్లనం*
*జెరకురసంబు గానుఁగను | జిప్పిలిపోయిన మీఁదఁ బిప్పియై*
*ధరఁబడియున్నఁ జేరవె ము | దంబునఁ జీమలు పెక్కు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
తన నిండా చెరకు రసమును నింపుకున్న చెరకు గడను గానుగలో వేసి రసం అంతా తీసివేసి పిప్పిని క్రింద పడవేస్తాము.  ఆపిప్పిలో ఇంకా ఏమో దొరుకుతుంది అని చేమలు చేరుతాయి కదా.  అలాగే, చాలా దయా గుణముకలిగి, దాత అయిన వారు కాలానుగుణముగా  బీదవారు అయినా కూడా ఇంకా వారి వద్ద నుంచి ఎదో ఒక  దానము ఆశించి  వారి దగ్గరకు వెళతారు, మనుషులు.....అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss