భరత పుత్రుడా!(గేయ సూక్తులు): - డాక్టర్. కొండబత్తిని రవీందర్- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819


 జాతి కోసము సర్వ మొడ్డిన

శాంతి దూతల దివ్య చరితను

తెలివి మీరగ తెలుసు కోరా

విలువ గలిగిన భరత పుత్రుడ!   9

 

వర్ణ భేదము సమసి పోయిన

భరత దేశము సంత సిల్లును

కులము లన్నియు కూడి ఉండిన

బలము తేజము భరతపుత్రుడ!  10


బడుగు జీవుల వెతలు బాపగ

అడుగు ముందుకు వేయ వేమిర?

సౌఖ్య పథమున భరత భూమిని

సాగ నంపర భరత పుత్రుడ!      11