జీవన మంత్రం ..:- ---డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ


 రైతన్న ఆనందం 

బ్రతుకు నిలబెట్టే 

వరిపంట 

బండినిండినప్పుడే !


కాడీ -జోడెద్దులబండి 

గల ..గల ..

గజ్జెల సవ్వడి చేస్తూ 

పంటను ఇంటికి చేర్చేది 

యజమాని ముఖంలో 

ఆనందం -

వెల్లివిరినప్పుడే ...!


ఇంట్లో ఇల్లాలి 

సంతోషం ....

వసారాలో 

వరిగాదెలు నిండినప్పుడే !!

    .