టైమ్ :--కె ఎస్ అనంతాచార్య

 ఎవరు ఎవరితో మాట్లాడటం అటుంచి కలవడం అంటే పండుగ పరుగున వచ్చి ముట్టిచ్చుకున్నట్టే  
ఫోనులోనే భాషణo చెవులు పగుళ్లు చూపేదాకా
చేతుల గీతలు కొత్త రాతలుగా మారేదాక
వాట్సాప్ లు గాసిప్పుల సింగారించుకుంటూ ఏప్రిల్ ఫస్ట్ లో పడేస్తున్నా ఒక దుఃఖం ఆనందం అలుమొగల అనుబంధం
 రాత్రి పగుళ్లు నెగళ్లు వేస్తూ ఎగ దోస్తున్నా
గడియారం ముల్లు మీద నిలబడి నీళ్లు తాగడం 
నెంబర్ల మధ్య తనను తాను కోల్పోయే మనిషితనం  ! 

గడియారానికి సహజమే కావచ్చు దాని వేగం నిత్యం సమానమే కానీ పోటీపడలేక పోట్ల గిత్త కాలుకింద పడ్డ చేతి వేళ్ళు! 
పట్టినదల్లా బంగారం ముట్టిందల్లా ముత్యాల వుతాయని నమ్మడం
బంగారు పుట్టలో  వెలుపెట్టే సాహసం! 
నమ్మకాలకు గీతలున్నాయి
 దాటితే రాతలు వమ్మౌతాయి! 
అడ్డ దిడ్డంగా
పరుగెత్తి నడిచే రైలును పట్టుకోలేం ఆగిపోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేం
శ్రమను నమ్మితే ఖర్మం కాలదు
సోమరితనం వీడితే  లక్కు చిక్కుముడి విప్పుకొని ముప్పు తప్పిస్తుంది
ఏ సమయమైనా రసమయమవ్వాలంటే నిముషాల నిప్పులమీద నీళ్లు చల్లి నిదానం ప్రదానమైతే చాలు! 
చూడాల్సింది కుర్చీకిందకి ఎన్ని ఏళ్ళు వచ్చాయని కాదు ఎన్ని గుండెలకు బాధల సీకులు గుచ్చామని 
ఎవరికోసం ఆగదు
దేనికోసం ఎదిరి చూడదు
చావు బతుకుల సాధారణమే తనపని తప్పక కొనసాగించే సమయఘంటిక
విలువైందే కావచ్చు
నీలి ఆకాశం లోని మెరుపును  పట్టలేం  
మొగిలి పూవు వాసనలు మూట కట్టలేం టైమ్ ను కొంగుకు ముడి వేయలేం