'' ఆ '' ఇద్దరు : - టి. వేదాంత సూరి


మేము  రోజు నిత్యావసరాలకు ఇంటికి దగ్గరలో కౌంట్ డౌన్ షాప్ వుంది ఇందులో అన్ని రకాల పళ్ళు, కూరగాయలు, సబ్బులు,  పాలు,మందులు , ఇలా అన్ని రకాలు దొరుకుతాయి. ఇది ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు  తెరచి ఉంటుంది. ఈ రోజు ఉదయమే అక్కడికి వెళ్ళాం, సుమారు రోజు, రెండు రోజులకు ఒకసారైనా అక్కడికి వెళుతుంటాం, దారిలో ఆద్య రక రకాల ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. మాట్లాడటం కంటే ప్రశ్నలకె ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. అంటే నిరంతరం ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆద్యతో ఉందని అనిపిస్తుంది. 
ఇప్పుడు ఒక సంఘటన చెప్పాలనిపిస్తుంది. ఆద్య వాళ్ళ మామయ్య ఇంట్లో వుంది, బయటకు షాపింగ్ వెళ్లాలని కోరిక, వెళదాం అని పోరు పెడుతుంది. కానీ టైం అయిపొయింది షాప్ మూసేస్తారని అత్త చెప్పింది. అప్పుడు ఆద్యకు ఒక ఆలోచన వచ్చింది , అత్తమ్మ షాప్ వారికి కాల్ చేయండి, ఆద్య కనినిపించడం లేదు తప్పి పోయింది అని చెప్పండి, షాప్ తెరచి ఉంచుతారు ఈలోపు మనం అక్కడికి వెళ్లొచ్చు అందట.. ఈ ఆలోచన విని అందరం ఒకటే నవ్వు. ఆలా చెప్పొద్దు, అబద్దాలు అనుకుంటారు, రేపు తీసుకు వెళతాం అని చెప్పితే సరే అంది. 
ఆర్య, ఆద్య, టి. వి. వద్ద ఆదుకుంటుంటారు, వారు ఏవీ  పట్టించుకోవడం లేదు అని మనం అనుకుంటాం, కానీ మనం చూసే సినిమా, పాటలు, బిగ్ బాస్ లోని పాత్రలు చెప్పేస్తారు, ఈ విషయం లో ఇద్దరూ ఇద్దరే. 
పిల్లల వద్ద, మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వారు మనలను గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఆద్య, ఆరియా ఫోటో తో పాటు నిన్న మనం చెప్పుకున్న జారా ఫోటో కూడా ఇస్తున్నాం, 
( మరిన్ని ముచ్చట్లు రేపు )