పతంగి:--- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పతంగి పతంగి పతంగిరా ఇది
వయ్యారాలా పతంగిరా
గాలిలోన ఇది ఎగురుతుందిరా
దాని దారం నాచేతనుందిరా
ఇల్లు వాకిలి దాటుతుందిరా
చెట్టూచేమలు దాటుతుందిరా
కొండాకోనలు దాటుతుందిరా
ఆకాశాన ఎగురుతుందిరా
చుక్కలదాకా సాగుతుందిరా
అంతరిక్షానికి పాకుతుందిరా
రంగురంగుల ఇంద్రచాపములు
నింగిలోనే నాట్యంచేస్తాయ్
చిన్నాపెద్దా ఎవరైనా
ఆడామగా ఎవరైనా
పట్టింపేమీ లేదండోయ్
సహనంతో ఎగరేయాలండోయ్ !!