ఠక్కునచెప్పండి. పురాణప్రశ్నలు-సమాధానాలు.: డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.


 1) అష్టవక్రుని తల్లి తండ్రిపేరేమిటి?

2)శుకమహర్షి భార్యపేరేమిటి?

3) దుంధుభి కుమార్తే పేరేమిటి?

4) హరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్మిన నగరం ఏది?

5) మన్మధుని పంచ బాణాల పేర్లేమిటి?

6)నవధాన్యాలపేర్లేమిటి?

 7)సకలగుణధాముడు అంటే ఎవరు?

 8) కైకేయి తండ్రి ఎవరు?

9)కస్యప మహర్షి ఆశ్రమం పేరేమిటి?

10) హుషుని సర్పంగా మారమని శపించింది ఎవరు?

సమాధానాలు:1) సుజాత-కహాలుడు.2) పినారి.3)మదనమంజరి. 4) కాశీ.5)అరవిందం-అశోకం-చూతం-నవమల్లిక-నీలోత్పలం.6)వడ్లు-ఉలవలు-పెసలు-మినుములు-నువ్వులు-గోధుమలు-కందులు-శెనగలు.రాగులు. 7) రాముడు.8) అశ్వపతి.9) సిధ్ధాశ్రమం.10) అగస్త్యుడు.